అక్కినేని పేరును ప్రస్తావించకుండా తెలుగు సినిమా చరిత్రను చెప్పుకోవడం అసాధ్యమే అవుతుంది. ఉదాత్తమైన నటననే కాదు ... ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన మహా మనిషి ఆయన. అక్కినేని పెద్దగా చదువుకోకపోయినా ఆయన ఆలోచనలు ... అనుభవాలు నేటికీ గౌరవమైన స్థానాన్ని దక్కించుకుంటున్నాయి. అందుకు కారణం, ఆయన అనుసరించిన మార్గాలు ... ఆచరించిన సూత్రాలు ... సాధించిన విజయాలు అని చెప్పుకోవచ్చు.
గతంలో ఆయన తన ఆలోచనా స్రవంతిని ఓ పుస్తకంగా మలిచారు. భావితరాలకి అది అవసరమని భావించిన సన్నిహితులు, 1980 లలో ఆ పుస్తకాన్ని 'అక్కినేని ఆలోచనలు' పేరుతో ఆయనతోనే ఆవిష్కరింపజేశారు. ఇటీవల ఈ పుస్తకం మార్కెట్లో దొరకకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారట. దాంతో వచ్చే నెలలో జరగనున్న అక్కినేని పుట్టిన రోజు వేడుకలో మరోసారి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమని సన్నిహితులు కోరుతున్నారట. మరి ఈ విషయంలో అక్కినేని ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.
Categories:

0 comments :