బహుముఖ ప్రజ్ఞశాలి, అలనాటి సినీనటి టి.జి. కమలాదేవి గురువారం కన్నుమూశారు. కమలాదేవి వయస్సు 84 సంవత్సరాలు. ఆమె అసలు పేరు గోవిందమ్మ. డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని, నటిగా తెలుగు చలన చిత్ర సీమలో కమలాదేవి తనదైన ముద్రను వేసుకున్నారు. అంతేకాకుండా ఆమె మంచి బిలియర్డ్స్ క్రీడాకారిణి. బిలియర్డ్స్ క్రీడలో రెండు సార్లు కమలాదేవి జాతీయ చాంపియన్ షిప్ ను గెలుచుకున్నారు. సుమారు ఆమె 70 సినిమాల్లో కథానాయకగా నటించారు.
కమలాదేవి దక్షయజ్ఞం, బాల నాగమ్మ, ముగ్గురు మరాఠీలు, గుణ సుందరి కథ, పాతాళభైరవి, మల్లీశ్వరి, కథానాయకుడు, ఇల్లరికం తోడు దొంగలు, పల్లెటూరు, చక్రపాణి, వెలుగు నీడలు, భక్త రాందాసు, బంగారు పంజరం, కంచుకోట, పెత్తందార్లు, అభిమానవతి చిత్రాల్లో నటించారు. కమలాదేవి సెన్సార్ బోర్డు చైర్మన్ గా కూడా సేవలందించారు.
ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమి ఆమెకు నాటక కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించారు. నాటకాలలో ప్రదర్శించిన అలెగ్జాండర్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆమె అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని బంధువులు వెల్లడించారు. కమలాదేవి మృతికి తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
0 comments :
Post a Comment