దాసరికి దక్కిన 'డమరుకం'
నాగార్జున - అనుష్క జంటగా రూపొందిన 'డమరుకం' చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్.ఆర్.మూవీమేకర్స్ వారు నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ నెల 12 న విడుదల కానున్న ఈ సినిమా కోసం నాగ్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీడెడ్ ప్రదర్శన హక్కులను దాసరికి చెందిన 'సిరి మీడియా' దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన భారీ రేటునే చెల్లించాడని అంటున్నారు. గతంలో 'జులాయి' సినిమా ప్రదర్శన హక్కులను సొంతం చేసుకున్న దాసరికి, ఆ సినిమా భారీ మొత్తంలో లాభాలను తెచ్చిపెట్టింది. అదే తరహాలో ఈ సినిమా కూడా దాసరికి లాభాల పంట పండించడం ఖాయమనే వార్తలు ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తున్నాయి.
0 comments :
Post a Comment