'రాంబాబు'పై టీడీపీ, టీఆర్ఎస్ 'ఫైర్' సినిమా ప్రదర్సన నిలిపివెత   'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రంపై వివాదం మొదలయింది తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అని కొన్ని  రాజకీయ పార్టీ లు విమర్శిస్తున్నారు . ఈ చిత్రంలో తమను టార్గెట్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు ఓపక్క, తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్గాలు మరోపక్క ఈ సినిమాపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 'ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై విషంగక్కిన పూరీ జగన్నాథ్' అంటూ 'నమస్తే తెలంగాణా' దినపత్రిక ఈ సినిమాను విమర్శిస్తూ ఈ రోజు ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. 'తెలుగుతల్లి పార్టీ, తెలుగు ఉద్యమం' అంటూ  ఇన్ డైరెక్ట్ గ  ఇందులో తమని విమర్శించారు అని తెలంగాణా వాదులు అభిప్రాయ పడ్డారు వరంగల్ హైదరాబాద్ లో నిరసనలు తెలిపారు తార్నాక ఆరాధన ధియేటర్ నుంచి బాక్స్ ని ఎత్తు కెళ్ళారు , తెలంగాణా ఉద్యమంపై దర్శకుడు  వ్యవహరించిన తీరు బాగోలేదు అని వారు అభిప్రాయ పడ్డారు వెంటనే పవన్ కళ్యాణ్ పూరి లు  బహిరంగంగా  సారీ చెప్పాలి అని డిమాండ్ చేసారు  ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణా ప్రజలను అవమాన పరచడమేనని తెలంగాణా వాదులు మండిపడుతున్నారు. 
       మరోపక్క, ప్రకాష్ రాజ్ పోషించిన 'రానా బాబు' పాత్ర టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఇరికించినదేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ పోషించిన 'రానా బాబు' లోని 'రానా' అన్న పదాన్ని తిరగేస్తే 'నారా' వస్తుంది. ఇలా ఆ పార్టీపై తనకున్న మంటను పూరీ ఇలా ప్రదర్శించాడని అంటున్నారు. పైగా, ప్రకాష్ రాజ్ పాత్ర ఓ సందర్భంలో 'టెన్షన్లతోనే మాకు బొల్లి, బీపీ, షుగర్ జబ్బులు వచ్చాయి...' అంటుంది. ఇది కూడా చంద్రబాబును ఉద్దేశించి రాసిన డైలాగేనని చెబుతున్నారు.
      ఇదిలా వుంటే, ఇంకోపక్క, వై.యస్.రాజశేఖర్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని నాజర్ పాత్ర ద్వారా పూరీ జగన్నాథ్ వ్యక్తం చేశాడని అంటున్నారు. ఆ పాత్ర పేరు చంద్రశేఖర్ రెడ్డి. వై.యస్. లా నాజర్ కూడా పంచెకట్టు కడతాడు. పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తాడు. అలా ఆ పాత్రను ప్రేక్షకుల దృష్టిలో మంచి పాత్రగా తీర్చిదిద్దాడు.  

ఈ సినిమా లో తెలుగు తల్లి గురించి తెలుగు బాష గురించి చెప్పను తెలుగు ఫై నాకు వున్నా ప్రేమ ని నేను నాకు తేలినట్టు చూపించాను అని పూరి అంటున్నారు తెలుగు తల్లి అని ఈ సినిమా లో  చెప్పారు ఒక సందర్భం లో తెలంగాణా రావడం నేకు ఇష్టం లేదా అని పవంకల్యాన్ డైలాగ్ కూడా చెపుతారు తెలుగు అనే ధీ ఒక భాష తెలంగాణా అనేది యాస  ఈ సినిమా లో తెలుగు భాషనీ తెలుగు తల్లి ని పొగిడారు దర్శకుడు అల అని తెలంగాణా ని కించపరచలేదు అని కొందరు అభిప్రాయ పడ్డారు ఈ కధ  ఎంత దూరం వెళ్తుందో చూడాలి 
వాస్తవానికి ఈ సినిమా ని వివాదం చేయవలసిన పని లేదు ఈ సినిమా మీడియా నేపధ్యం లో వచినప్పుడు వాస్తవాలు చూపించడం సర్వసహజం ఈ విషయం గమనార్హం 

0 comments :