కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా వివాదం
పూరీ జగన్నాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తీసిన కెమేరామన్ గంగతో రాంబాబు సినిమా వివాదాస్పదంగా మారింది.ఇది తెలంగాణ ఉద్యమ నేతలను కొందరిని లక్ష్యంగా పెట్టుకుని కొన్ని డైలాగులు చెప్పించారని అంటూ వరంగల్, హైదరాబాద్ లలో కొందరు తెలంగాణ ఆందోళనకారులు సినిమా ప్రధర్శనలకు వ్యతిరేకంగా నిరసనలు చెబుతున్నారు.ఉస్మానియా యూనివర్శిటీ కి చెందిన కొందరు విద్యార్దులు సమీపంలోని ఒక ధియేటర్ కు వెళ్లి ఈ సినిమా రీల్ ను దగ్ధం చేశారు.దీంతో సినిమా హాలులో ప్రదర్శన నిఇచిపోయింది.కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కటౌట్లను కూడా దగ్దం చేశారు.పూరీ జగన్నాద్, పవన్ కళ్యాణ్ లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమాను వినోదాత్మకంగా తీయవచ్చు.కాని అనవసరంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి ఆస్కారం కలిగేలా సినిమాను ఉండడం అంత మంచిది కాదు. దీనివల్ల కొత్త సమస్యలు వస్తాయి.దీనిపై పూరీ జగన్నాద్ స్పందిస్తూ ఎవరి మనోభావాలు కించపరచడం నా ఉద్దేశం కాదు  ఒక మంచి సినిమా తీసాను అని అనుకుంటున్నా తెలంగా వాదులకు సినిమా చూపిస్తాను వారు అభ్యంతరాలు చెపితే తొలగిస్తాను అని చెప్పారు , పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

0 comments :