పెద్దాయన షూటింగ్ ప్రారంభం



దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత విశేషాలే కథాంశంగా ‘పెద్దాయన’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర నిర్మాత కారెం మమత తెలిపారు. తాటిచెట్లపాలెం జాతీయ రహదారిపై వైఎస్సార్ నగర్‌లో శుక్రవారం ‘పెద్దాయన’ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త జి.వి.రవిరాజు క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ముహూర్తం షాట్‌కు మమత దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు షెడ్యూల్స్‌లో చిత్ర నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అనంతపురం, కడప, హైదరాబాద్, ఇడుపులపాయ ప్రాంతాల్లో సినిమాను నిర్మిస్తామన్నారు. నవంబర్ నెలలో సినిమా విడుదయ్యేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ పాత్రలో కారెం వినయ్‌ప్రకాష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నారన్నారు. మరో ముఖ్యపాత్రలో పాయకరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబూరావు నటిస్తున్నట్లు తెలిపారు. వీరా, తేర రంగారావు, డాక్టర్ చంటిబాబు, సుధాపూర్ణిమ, జాన్, వైజాగ్ మూర్తి, బిషాయ్, మొక్కల మోహన్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తారని వివరించారు. కథ, స్క్రీన్‌ప్లే కారెం వినయ్‌ప్రకాష్ అందిస్తున్న ఈ చిత్రానికి సంగీతం పి.ప్రమోద్‌కుమార్, కెమెరా ధర్మాన వెంకటరమణ, ఎడిటింగ్ రామచంద్రనాయుడు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సినిమా కి Telugucinemas.in  official  website  partner 
Categories:

0 comments :