ఏవీయస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 


ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ఏవీయస్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదిలలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో 
పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ అధ్యక్షుడు, వివేకా విద్యా సంస్థల అధినేత 
ఆర్. వీరనారాయణ తెలిపారు. ఈ శిబిర నిర్వహణ నిమిత్తం ఏవీయస్ గౌరవ అధ్యక్షుడిగా కమిటీ ఏర్పడిందని ఆయన 
తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, కార్డియాలజీ, న్యూరాలజీ, 
గ్యాస్ట్రో ఎంటరాలజి, జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన పలువురు సీనియర్ వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని 
రోగులను పరీక్షించి సలహాలనిస్తారని. రోగులకు ఉచితంగా మందులు కూడా ఇస్తామని ఆయన వివరించారు. 
షుమారు 4 వేలకు పైగా పేదలు ఈ శిబిరంలో పాల్గొంటారని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కిందటి 
ఏడాది కూడా ఏవీయస్ ఆధ్వర్యంలోనే ఈ శిబిరాన్ని నిర్వహించామని, ఆ శిబిరం కనీ వినీ ఎరుగని రీతిలో 
విజయవంతమైందని, ఆ స్ఫూర్తి తోనే ఈ సారి రెండురోజుల పాటు నిర్వహిస్తున్నామని వీర నారాయణ పేర్కొన్నారు. 
20 వ తేది ఉదయం నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ డాక్టర్ వియన్నారావు శిబిరాన్ని ప్రారంభిస్తారని,
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి అతిధిగా పాల్గొంటారని ఆయన తెలిపారు.


Categories:

0 comments :