అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్-అంత ఎంజాయ్ చేసే సినిమా కాదు


తారాగణం: వరుణ్ సందేశ్, హరి ప్రియ, సన, ఆహుతి  ప్రసాద్ మరియు వెన్నెల కిషోర్
దర్శకుడు:కోనేటి శ్రీను
నిర్మాత : లక్ష్మన్ క్యాదారి 
సంగీతం : శేఖర్ చంద్ర
A  సర్టిఫికెట్ సినిమా
చుసిన హాల్  "దేవి 70mm", హైదరాబాద్
Telugucinemas.in  రేటింగ్- 2/5
వివరాలు 
ప్రతి నెల ఏదో ఒక్క సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చే వరుణ్ సందేశ్ ఈ నెల  కూడా అలవాటు గ వచేసారు అయన ఈ సారి చాల  క్లాసు గ అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అనే సినిమా తో తన అదృష్టాన్ని  టెస్ట్ చేసుకున్నారు ఈ సినిమా కూడా తన గత సినిమా లు మరిదిగానే  బోల్త కొట్టేసింది  హిట్ కొట్టాలి అని తపన తో అయన వరసగా సినిమా లు చేస్తూనే వున్నారు కానీ ఆ విజయం వరించడం లేదు ఇక ఈ సినిమా విషయానికి వస్తే  వరుణ్ సందేశ్  కి అమ్మాయిలు అంటే భయం మాటలు కాదు కదా కనీసం చూపులు కూడా చూడడు   ఇక ఈ సినిమా లో హీరొయిన్  గ పిల్ల జమీందార్ సినిమా లో నటించిన హరి ప్రియ చేసింది అమెది ఒక వేశ్య  పాత్ర 

ఆడవాళ్లు  అంటే బయపడే  శ్రీ (వరుణ్ సందేశ్ )  తన బిజినెస్ లో లాస్ వస్తే ఆ కంపెనీ ని తిరిగి నిలబెట్టడానికి స్పాన్సర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పడు  అంజలి ఎంట్రీ ఇస్తుంది ఆమె అటుకుల  చిట్టిబాబు కూతురు కాదు అంజలి గ్రూప్ అఫ్ కంపెనీస్ M D కెకె (ఆహుతి ప్రసాద్) కూతురు ఎలా అయిన శ్రీ (వరుణ్ సందేశ్ ) ని పెళ్లి చేసుకోవాలి అని అంజలి ఫిక్స్ అవుతుందు అప్పుడు  మీ కంపెనీకి నేను స్పాన్సర్ చేస్తాను కానీ నా కూతురు అంజలిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతాడు కే కే 
స్వతహ గ మన శ్రీ కి అమ్మాయిలు అంటే భయం ఆ భయం తో అంజలి దగ్గర కి వెళ్ళడానికి సాహసించాడు మన హీరో  ఈ భయం పోవాలి అంటే ఎలా అని  ఆలోచిస్తూ వున్నా తరుణం లో తనకు అమ్మాయిలంటే ఉన్న భయం పోవాలని కొద్ది రోజులు ఒకమ్మాయితే  గడపాలి అని నిర్ణయించుకుంటాడు  అమ్మాయిల వేటలో పడతాడు కొన్ని చేదు అనుభవాల తరవాత  ఇతగాడి సమస్యకి వేశ్య  అయితేనే కరెక్ట్ అని తెలుసు కుంటాడు వేశ్య అయిన నీరు(హరిప్రియ)ని కాంట్రాక్ట్ మీద కొన్ని రోజులు తన ఇంటికి తీసుకువస్తాడు  ఇంతకి   శ్రీ (వరుణ్ సందేశ్ ) భయం పొయింద ప్రేమ లో పడితే ఎవరితో పడ్డాడు పెళ్లి అంజలిని చేసుకున్నాడ అన్నది మిగిలిన కధ  మీరు  తెరపైనే చూడాలి. 

హై లైట్స్ 
పిల్ల జమీందార్ సినిమా లో ఎంత క్లాసు గ కనిపించిన హరిప్రియ ఈ 
సినిమా లో వేశ్య   గ నటించింది ఆమె పాత్ర ఈ సినిమా కి మేజర్ హైలైట్ కొన్ని సీన్లు లో అందాల ప్రదర్సన మాస్ ని ఆకట్టుకుంటుంది  
ఎడారి  లో ఒయాసిస్ ల సినిమా చివరి లో కొంచం సంప్రదాయం గ కనిపించింది హరిప్రియ (నీరు) 
కౌష ఐటెం సాంగ్ తో కాస్త ఊపిరి పీల్చుకున్నారు మాస్ ఆడియన్స్ 
 కొన్ని లొకేషన్స్ బాగున్నాయి 

మైనస్ పాయింట్స్ 
ఈ సినిమా లో హై లైట్స్  తక్కువ మైనస్ పాయింట్స్ ఎక్కువ అని చెప్పాలి కామెడీ లేక పోవడం ఈ సినిమా కి పెద్ద మైనస్ నిజానికి ఈ సినిమా ఒక ఇంగ్లీష్ హిట్ సినిమా  ఫ్రీ  రీమేక్
(ఆ కధ బేస్  తో రాసారు) ‘ప్రెటీ ఉమెన్’అనే ఇంగ్లీష్ సినిమా కి చాల దగ్గర గ వుంది 
కొన్ని సీన్స్ లు వేరే తెలుగు హింది సినిమా లను కూడా గుర్తు చేస్తాయి సైలెంట్ గ చంపేసే హరిదాసు పాత్రా ఎక్కడో చూసినట్టు వుంది అని అనుకున్నాము బాగా ఆలోచిస్తే కహాని సినిమా తెలిసింది  
ముందు చెప్పినట్టు నవ్వు కూడా ఎక్కడ రాలేదు ఈ సినిమా చూసినప్పుడు  హీరొయిన్  మొగలి రేకలు సీరియల్ చూడాలి అన్నపుడు మాత్రం కొంత మందికి నవ్వు వచ్చింది  
ఈ సినిమా లో వున్నా కొంత మంది నటులను సరిగా వాడుకోలేదు దర్శకుడు ధన రాజ్ వెన్నెల  కిషోర్ లాంటి వారు కూడా నవ్వించ లేక పోయారు అని చెప్పక తప్పడం లేదు 

సాంకేతిక పరంగా ఈ సినిమా కి పని చేసిన వారి తీరు  బాగానేవుంది 
శేఖర్ చంద్ర మ్యూజిక్  బాగానే వుంది 
డైరెక్టర్ కొంచం అప్రమత్తం గ వుంది వుంటే సినిమా బాగుండేది 
ఎడిటింగ్  పరవాలేదు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి వున్నదంట్లో రిచ్ గానే తీసారు 

చివరిగా తీర్పు 
ఈ సినిమా  ఒక్కసారి చూసే సినిమా ల కోవకి చెందుతుంది  బాగా సాగదీయడం వాళ్ళ ఈ సినిమా బోర్ గ అనిపించింది  ఈ సినిమా లెంత్ కొంచం తగ్గిస్తే ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తాయి అని అనుకుంటున్నా 
కనీసం ఇప్పటి నుంచి అయ్యిన వరుణ్ సందేశ్ ఆచి తూచి కధలు ఎన్నుకుంటే మంచిది  

రివ్యూ -సందీప్ 







Categories:

0 comments :