కామెడీ చిత్రాల  హీరో అల్లరి నరేష్ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. నరేష్ నటించే ఓ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు సమకూరుస్తున్నాడట. ఔట్ అండ్ ఔట్ కామెడీతో సాగే ఓ కథను, అందుకు తగ్గా పంచ్ డైలాగులతో పూర్తి స్క్రిప్టును త్రివిక్రమ్ తయారుచేశాడట. ఈ చిత్రానికి 'చిరునవ్వుతో' ఫేం రామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. గతంలో వేణు కథానాయకుడుగా రామ్ ప్రసాద్ రూపొందించిన 'చిరునవ్వుతో' సినిమాకి త్రివిక్రమ్ రాసిన డైలాగులకు ఎంతో పేరొచ్చింది. పైగా, ఆ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది కూడా. ఆ సెంటిమెంటుతో ఇప్పుడు త్రివిక్రమ్ తో రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ చేయించుకున్నాడట.అల్లరి నరేష్  కామెడీ కి త్రివిక్రమ్ మాటలకి సరిగా సరిపోతుంది చూసే ప్రేక్షకులకు కడుపు చేక్కలవడం ఖయం  ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీద కి వెళ్ళే ఛాన్స్ వుంది 
Categories:

0 comments :