అభిమాన నటుడి సినిమా ని రిలీజ్ రోజే చూడాలి అని ప్రతి అభిమాని అనుకుంటాడు లైఫ్ లో ఒక్కసారైన  అభిమాన హీరో ని కలవాలి అనుకుంటారు అలాంటిది ఆ హీరో   సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా.... వదులుకోరు కదా... యువ కథానాయకుడు నితిన్ కూడా అలాగే వదులుకోలేదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో
 యంగ్ హీరో నితిన్ నటిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ నటించిన ‘ఇష్క్’ సినిమా ఆడియోను పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం చూసిన తరువాతే తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన కలిగిందని ఆ సంధర్భంగా నితిన్ అన్నాడు.
అయితే హిందీ చిత్రం ‘దబాంగ్’ ఆధారంగా ‘గబ్బర్ సింగ్ ’ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నితిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో నితిన్ నటించే సన్నివేశాలను ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
 పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఈ సీన్స్ వస్తాయనీ, ప్రేక్షకులకు మంచి వినోదాన్నిస్తాయనీ అంటున్నారు. సినిమా విడుదల వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట.పవన్ కళ్యాణ్ సినిమా లో నితిన్ నటించడం నితిన్ కే బాగా ఉపయోగపడుతుంది  

0 comments :