బ్రహ్మానందం ఫైర్
బహ్మానందం ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘ఫైర్’ ఒకటి.
వెండితెరపై బ్రహ్మాండంగా నవ్వులు కురిపించే బ్రహ్మానందం ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘ఫైర్’ ఒకటి. టైటిల్ చాలా హాట్‌గా ఉన్నా బ్రహ్మానందం మాత్రం తనదైన శైలిలో కూల్‌గా నవ్వించబోతున్నారు. ఎస్‌బీకే ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై హీరోగా నటిస్తూ ఎస్.కె.బషీద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నమిత, సంధ్య, భానుశ్రీమెహ్రా, రేఖ, రిషిక నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని కోకాపేటలో గల క్వారీలో ఆయన పాల్గొనగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మా సంస్థలో వచ్చిన ‘అల్లరే అల్లరి’ విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
Categories:

0 comments :