'సీతమ్మ వాకిట్లో...' ఫస్ట్ లుక్
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ... కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధాలను - అనుబంధాలను కథా వస్తువుగా చేసుకుని తెరకెక్కుతోన్న చిత్రమే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్ - మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తోన్న ఈ సినిమాలో, వారి జంటగా సమంతా - అంజలి నటిస్తున్నారు. చంటి అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈ రోజు విడుదల చేశారు.
    మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ను విడుదల చేశారు. అలాగే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రేపు సెకండ్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. Simple but beautiful అనే క్యాప్షన్ తో డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే, 'సోదరుడు మహేష్ కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ వెంకటేష్ విషెస్ చెబుతున్నట్టు డిజైన్స్ లో ఇవ్వడం బాగుంది!   ఇకసినిమా FIRSTఫస్ట్ లుక్  కి విశేష స్పందన లభిస్తోంది 
Categories:

0 comments :