పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త. 'కెమెరామేన్ గంగతో రాంబాబు' సినిమా అనుకున్న సమయం కంటే ఓ వారం ముందుగా అంటే, అక్టోబర్ 11 న విడుదల కానుంది. మొదట్లో ఈ సినిమాని అక్టోబర్ 18 న విడుదల చేస్తామని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించారు. అయితే, నిర్మాణ కార్యక్రమాలు మరింత త్వరగా పూర్తి కావస్తున్నందున విడుదల తేదీని ఓ వారం రోజులు ముందుకి తెచ్చారు. గతంలో 'బిజినెస్ మేన్' సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమాని జనవరి 14 న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించి, చివరికి జనవరి 11 నే విడుదల చేశారు. ఇప్పుడూ అలాగే జరగడం విశేషం. ఈ విధంగా 'పని రాక్షసుడు' అన్న బిరుదును పూరీ జగన్నాథ్ పొందుతున్నాడు!

Categories:
General News
,
Telugu
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments :
Post a Comment