ఆర్యమన్, కావ్యాసింగ్ జంటగా సూర్యలోక్ ఫిల్మ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన 'సారీ టీచర్' సినిమాకి వ్యతిరేకంగా ఉపాద్యాయ, విద్యార్ధి లోకం నడుం బిగించింది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాను విడుదల కాకుండా నిలుపుదల చేయాలని కోరుతూ ఆంద్ర ప్రదేశ్ ఐక్య ఉపాద్యాయ ఫెడరేషన్ (UTF), ఐద్వా ప్రతినిధులు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
గురు, శిష్యుల మధ్య వుండే పవిత్రమైన అనుబంధాన్ని అపవిత్రం చేసే విధంగా, అగౌరవపరచే రీతిలో వున్న ఈ 'సారీ టీచర్' సినిమాను నిషేధించాలని వీరు డిమాండు చేస్తున్నారు. గతంలో 'ఐ లవ్యూ టీచర్' పేరుతో షూటింగు చేసి, ఇప్పుడు టైటిల్ మార్చి విడుదల చేయబోతున్నారని అన్నారు. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ను ఉపసంహరించుకోవాలని కూడా వారు కోరుతున్నారు. విడుదలకు ముందుగా ఉపాద్యాయ, విద్యార్ధి సంఘాల ప్రతినిధులకు ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
0 comments :
Post a Comment