FANS SHOOTING WITH PAWAN KALYAN WILL START FROM TOMMAROW
పవన్ కల్యాణ అభిమానులకు శుభవార్త మీరు ఎంత గానఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాలో పవన్ తో కలిసి నటించే అవకాశం ఆయన అభిమానులకి ఇస్తానని పూరీ జగన్నాథ్ గతంలో మాటిచ్చారు. ఇటీవల ఓ రోజున ఆ అవకాశాన్ని కల్పించారుగానీ ... వర్షం కారణంగా షూటింగును కేన్సిల్ చేసుకున్నారు.
తాజాగా పూరీ ట్విట్టర్ ద్వారా పవన్ అభిమానులకు ఆహ్వానం పలికారు. అభిమానుల కాంబినేషన్లో పవన్ సన్నివేశాలను రేపటి (ఆగష్టు 9) నుంచి 12 వరకూ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నట్టు చెప్పారు. ఈ నాలుగు రోజులు కూడా ఈ సినిమా షూటింగ్ అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని అన్నారు. మొన్నామధ్య ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో ... హైదరాబాద్ లోని అభిమానులు మాత్రమే రావాలంటూ పిలుపునిచ్చిన పూరీ, ఈసారి అలాంటి విషయాలేమీ చెప్పకపోవడం గమనించదగిన విషయం.
0 comments :
Post a Comment