బాలీవుడ్ నిర్మాత సలీమ్ అక్తర్ కు ... అందాల తార తమన్నాకు మధ్య వివాదం అంతకంతకు ముదురుతోంది. బాలీవుడ్ తెరకి తమన్నాను పరిచయం చేసినందుకు గాను ఓ అయిదేళ్ళ పాటు ఆమె తీసుకునే పారితోషికంలో 25 శాతం తనకి ఇవ్వాలంటూ తాను డిమాండ్ చేశాననీ, అందుకు అంగీకరించి అగ్రిమెంట్ పై సంతకం చేసిన ఆమె ఆ తరువాత ఆ మాట నిలబెట్టుకోకుండా తనని మోసం చేసిందని సలీమ్ అక్తర్ వివాదానికి తెర లేపాడు. బాలీవుడ్ సినిమా చేస్తోన్న తమన్నాకి భారీ కష్టమే వచ్చి పడిందనీ ... ఆమె ఈ వివాదం పట్ల ఎలా స్పందిస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సలీమ్ అక్తర్ ధోరణి పట్ల తమన్నా తండ్రి ఘాటుగా స్పందించాడు. తన కూతురు సలీమ్ అక్తర్ తో అగ్రిమెంట్ చేసిన విషయం నిజమేననీ ... అయితే పారితోషికంలో 25 శాతం అతనికి ఇవ్వాలనే నిబంధన అందులో లేదని అన్నాడు. తమన్నా కెరియర్ పై బురద చల్లడానికే సలీమ్ ఇలా అబద్ధాలు మాట్లాడుతున్నాడనీ ... అవసరమైతే ఆ అగ్రిమెంట్ ను మీడియా సమక్షంలో చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. మరి ఈ సవాల్ ను సలీమ్ ఎలా స్వీకరిస్తాడో ... దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అనేది అంతటా ఆసక్తికరంగా మారింది.
Categories: ,

0 comments :